గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (10:13 IST)

ఫుట్‌పాత్‌పై పట్టపగలు మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్.. ఆటో డ్రైవర్ అరెస్ట్

rape
ఉజ్జయినిలోని ఫుట్‌పాత్‌లో పట్టపగలు మహిళపై అత్యాచారానికి పాల్పడుతున్న దృశ్యాలను చిత్రీకరించి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. అరెస్టయిన వ్యక్తిని మహ్మద్ సలీం ఆటో రిక్షా డ్రైవర్‌గా గుర్తించారు. 
 
అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేసిన అసభ్యకర వీడియోను రికార్డ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఆటోడ్రైవర్‌పై ఐటీ చట్టం, మహిళల అసభ్య ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్‌ 72, 77, 294 కింద ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన సెప్టెంబర్ 5న జరిగింది. అయితే, ఒక రోజు తర్వాత సోషల్ మీడియాలో ఆందోళన కలిగించే వీడియో వైరల్ కావడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.