ఖైదీల్లో ఎక్కువ మంది వెనుక బడిన తరగతులే
దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీల్లో65.90% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారే నని కేంద్రం వెల్లడించింది. ఖైదీల సామాజిక వర్గాలను తెలపాలని రాజ్యసభ ఎంపీ సయ్యద్ నశీర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు.
దేశంలో మొత్తం4.78,600 మంది ఖైదీలు ఉంటే అందులో3,15,409(65.90%) మంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అని చెప్పారు మొత్తం ఖైదీల్లో4,58,687 మంది పురుషులు కాగా19,913 మంది మహిళలు ఉన్నారు.