మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2022 (11:00 IST)

క్రిటికల్ కేర్ యూనిట్‌లో ములాయం సింగ్ : మేదాంత ఆస్పత్రి

mulayam singh
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వృద్ధనేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. 
 
అయితే, ములాయం సింగ్‌కు కిడ్నీలు పాడైపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో కిడ్నీలు దానం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తున్నారు. అదేసమయంలో కార్యకర్తలు నేతాజీ అని ముద్దుగా పిలుచుకునే ములాయంను చూసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ సమాజ్‌వాదీ పార్టీ కోరింది. 
 
ప్రస్తుతం వెంటిలేటర్‌పై ములాయం సింగ్‌కు ఐసీయూ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ కోరింది. అదేసమయంలో నేతాజీ ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు, ములాయం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.