గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (16:14 IST)

మురికివాడలకు రంగులే రంగులు.. సినిమా సెట్టింగ్‌లా వుందోచ్..

ముంబై మురికివాడలు రంగు రంగులుగా మారిపోయాయి. ముంబైలోని మురికివాడలకు స్వచ్చంధ సంస్థలతోపాటు.. దేశవ్యాప్తంగా ఉన్న వాలెంటీర్లు భాగస్వామ్యంతో రంగులు అద్దుతున్నారు. చల్ రంగ్ దే ఫౌండర్ అయిన దేదీప్యరెడ్డి మురి

ముంబై మురికివాడలు రంగు రంగులుగా మారిపోయాయి. ముంబైలోని మురికివాడలకు స్వచ్చంధ సంస్థలతోపాటు.. దేశవ్యాప్తంగా ఉన్న వాలెంటీర్లు భాగస్వామ్యంతో రంగులు అద్దుతున్నారు. చల్ రంగ్ దే ఫౌండర్ అయిన దేదీప్యరెడ్డి మురికివాడల్లో మార్పుకి శ్రీకారం చుట్టారు.


ఇందులో భాగంగా అన్నీ ఇళ్లకు రంగులేశారు. ఈ రంగులు మనిషిలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతాయని దేదీప్యరెడ్డి అన్నారు. ఈ క్రమంలో ముంబైలో ఖర్ దండా మురికివాడను ఎంచుకుని.. అక్కడున్న ఏడువేల ఇంటికి రంగులు వేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అందరూ కలిసి రావాలని తన పౌండేషన్ ద్వారా పిలుపునిచ్చారు.
 
ఈ పిలుపు భారీ స్పందన వచ్చింది. రెండువేల మంది ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్, సామాజిక కార్యకర్తలు రంగులు వేయటానికి ముందుకొచ్చారు. కొన్ని కంపెనీలు, ప్రభుత్వ సహకారం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి ఇప్పటివరకు 300 ఇళ్లకు పెయింటింగ్ వేశారు. 
 
రోడ్ల పక్కన, బ్రిడ్జీలు, షాపులకు కూడా అద్భుతమైన బొమ్మలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఖర్ దండా ఏరియా మొత్తం పెయింటింగ్ పనుల కోసం మూడు నెలల సమయం పడుతుందని, ప్రస్తుతం స్థానికుల సహకారం కూడా అందుతోందని వాలంటీర్లు చెప్తున్నారు. ఈ పెయింటింగ్‌ను చూస్తే.. మురికివాడల్లా లేవని.. పై నుంచి చూస్తే సినిమా సెట్టింగ్‌లా వుందని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.