మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (16:43 IST)

ముంబైలో దంచికొడుతున్న వర్షాలు - రైల్వే స్టేషన్‌లలోకి నీరు

rain water
దేశ ఆర్థిక రాజధాని ముంబై వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఉదయం వరకూ కురిసిన వర్షానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధానిలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. 
 
సియోన్ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. నడుములోతు నీటిలో వాహనాలు నడపడం సాధ్యపడడం లేదు. ముఖ్యంగా రత్నగిరి జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నవీ ముంబైలోని ఖందేశ్వర్‌ రైల్వేస్టేషన్‌ జలమయమైంది. మోకాళ్లులోతు వరకు నీళ్లు చేరాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. 
 
అంధేరి ప్రాంతంలోనూ భారీ వర్షానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సబర్బన్ రైళ్లన్నీ సాధారణంగానే తిరుగుతున్నా.. రోడ్లపై వరద నీరు చేరడం వల్ల... పలు బస్సులను దారిమళ్లించారు. 
 
ముంబై పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని ఇదివరకే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా మహారాష్ట్ర సర్కార్‌ ఎన్​డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది.