సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (11:03 IST)

తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాక్.. అదేంటంటే?

తెలంగాణ ఆర్టీసీకి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. 15 ఏళ్లు దాటిన బస్సులను నడపొద్దంటూ రవాణా శాఖ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీస్‌లతో బస్సుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. గత ఏడాది లెక్కల ప్రకారం 97 డిపోల పరిధిలో 9,708 బస్సులు తిరిగాయి. 
 
ఇందులో 3,107 అద్దె బస్సులున్నాయి. కాలంచెల్లినందున సంస్థ సొంత బస్సుల్లో కాలంచెల్లిన 600 బస్సులను పక్కనబెట్టనున్నారు. వాటి స్థానంలో 500 ఎలక్ట్రికల్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
 
సంస్థకు ఉన్న బస్సులు, వాటి కండిషన్‌పై రివ్యూ చేశారు ఎండీ సజ్జనార్‌. మొత్తం 97 డిపోల వారీగా మొత్తం బస్సులు, తిరుగుతున్న రూట్లు, సిబ్బంది, ఆదాయం, నష్టంతో పాటుగా డిపోకు ఉన్న భూముల గురించి సమగ్రంగా వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. లాభ, నష్టాల ఎజెండా ప్రాతిపదికగానే… సజ్జనార్‌ ఈ రివ్యూలు చేసినట్టు సమాచారం.
 
97 డిపోలు కూడా నష్టాల్లోనే ఉన్నాయని, కొన్నింటిలో నష్టాలు మూడింతలుగా ఉన్నట్టుగా తేలింది. ఫలితంగా మొదట కొన్ని డిపోలను మూసేసి అక్కడి సిబ్బందిని వేరే డిపోల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.