సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:11 IST)

నా కోడలికి పెళ్లికి ముందే అక్రమ సంబంధం ఉండేది : ఉజ్వలా శర్మ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఉన్న ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ మృతి కేసులోని మిస్టరీ వీడిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు రోహిత్ శేఖర్ భార్య అపూర్వ శుక్లాగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్ధారించి అరెస్టు చేశారు. దీనిపై రోహిత్ శర్మ ఉజ్వలా శర్మ స్పందిస్తూ, అపూర్వ సుప్రీంకోర్టులో లాయర్‌గా పని చేస్తోందన్నారు. 
 
ఒక మాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా 2017లో రోహిత్, అపూర్వలు లక్నోలో తొలిసారి కలుసుకున్నారని, ఒక యేడాది పాటు ఒకరినొకరు కలుసుకునేవారని... ఆ తర్వాత దూరమయ్యారని తెలిపారు. ఉజ్వలను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక రోహిత్ ఆమెకు దూరంగా ఉన్నాడని చెప్పారు. 2018 జనవరి నుంచి మార్చి వరకు వాళ్లిద్దరూ టచ్‌లో లేరని తెలిపారు. 
 
గత యేడాది ఏప్రిల్ 2వ తేదీన ఇద్దరూ తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్పారని ఉజ్వల అన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నా వారి దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదన్నారు. వివాహమైనప్పటి నుంచి వారిద్దరూ తరచుగా గొడవపడేవారని వెల్లడించారు. 
 
పైగా, పెళ్లిన ఆర్నెల్లకే విడాకులు తీసుకునే విషయంలో వారిద్దరి మధ్య ఎన్నోసార్లు చర్చ జరిగిందని చెప్పారు. చివరకు వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారని చెప్పారు. పైగా, పెళ్లికి ముందే అపూర్వకు మరో వ్యక్తితో సంబంధం ఉందని చెప్పారు. ఆమె కుటుంబానికి డబ్బే ప్రధానమని, తమ ఆస్తిపై కన్నేశారని ఆమె ఆరోపించారు.