బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (19:40 IST)

కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య.. రాహుల్ గాంధీ ఏమన్నారు.?

Rahul Gandhi
Rahul Gandhi
కర్ణాటక 24వ సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంచేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడింయంలో 15వేల మంది సమక్షంలో కాంగ్రెస్ నేత, సిద్ధరామయ్య శనివారం కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఐదు హామీలను నెరవేర్చేందుకు ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. 
 
ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సిద్ధరామయ్యతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. ఈ ఇద్దరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.  
 
ఈ కార్యక్రమానికి తన సోదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. తమ పార్టీ హామీ ఇచ్చిన ఐదు హామీలను నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు. సినీ నటుడు కమలహాసన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.