సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (16:29 IST)

నదిపై పట్టాలు తప్పిన గూడ్సు రైలు

Train
ఒడిషా రాష్ట్రంలో ఓ గూడ్సు రైలు నదిపై పట్టాలు తప్పింది. ఫిరోజ్‌ న‌గ‌ర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న స‌రుకు ర‌వాణా రైలు ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేష‌న్ దాటిన త‌ర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ప‌ట్టాలు త‌ప్పింది. 
 
ఈ ప్ర‌మాదంలో రైలులోని 9 వ్యాగ‌న్‌లు బోల్తాప‌డ్డాయి. మ‌రో వ్యాగ‌న్ ప‌ట్టాలు త‌ప్పి నిలిచిపోయింది. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 2:35 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. 
 
తాల్చేర్ రోడ్డుకు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఓ న‌ది వంతెన‌పై రైలు ప‌ట్టాలు త‌ప్పింద‌ని, అయితే రైల్లోని ఒక్క వ్యాగ‌న్ కూడా నీళ్ల‌లో ప‌డ‌లేద‌ని రైల్వే అధికారులు చెప్పారు. అదేవిధంగా ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌రుగలేద‌ని, ఎవ‌రికీ గాయాలు కూడా కాలేదని తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ఎనిమిది రైళ్లను దారి మళ్లించారు.