110 కిమీ వేగంతో వెళుతున్న రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడు.. ఎక్కడ?
సాధారణంగా చిన్నగా వెళుతున్న రైలు నుంచి జారిపడితేనే గాయాలు ఏర్పడతాయి. అలాంటిది 110 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా, ఆ ప్రయాణికుడు ప్రాణాలతో లేచి తిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అమిత వేగంతో వెళుతున్న రైలు నుంచి పడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు.
పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ఫ్లాట్‌ఫాంపై పడ్డాడు. ఆ రైలుతో పాటు అతను కూడా 100 మీటర్ల వరకు ముందుకు జారుతూ వెళ్లాడు. ఆ తర్వాత లేచి దులుపుకుని వెళ్లిపోయాడు. అంత వేగానికి కిందపడినా ఆ ప్రయాణికుడుకి ఎలాంటి కాకుండా వెంటనే లేచి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు ఇపుడు వైరల్ అయ్యాయి.