50 ఇంటర్వ్యూలలో ఫెయిలయ్యింది.. కోటి ప్యాకేజీతో జాబ్ కొట్టింది
సంప్రితి యాదవ్ వయస్సు 24 యేళ్లే. కానీ ఏకంగా గూగుల్‌లో కోటి రూపాయల జాబ్‌ను కొట్టేసింది. అంతకుముందు 50 ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయ్యింది. అయినా కూడా తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు.
1.10 కోట్ల రూపాయల ప్యాకేజ్‌తో లండన్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కు సెలక్ట్ అయ్యింది. ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు చాలా నెర్వెస్‌గా ఫీలయ్యేదాన్ని. కానీ నాకు తల్లిదండ్రులు, స్నేహితులు ధైర్యం చెప్పారు.
వాళ్లే నన్ను ఎంకరేజ్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీల గురించి తెలుసుకోవడంలో చాలా సమయం గడిపేవారు. ఆ కంపెనీలలో ఇంటర్వ్యూలంటే అది ఒక డిస్కషన్ లాగే ఉంటుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం నాకు ఇంటర్వ్యూలలో నాకు కాన్ఫిడెన్స్‌ను ఇచ్చింది.
2021లో ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి బిటెక్ పట్టా పొందిన సంప్రితి యాదవ్ సాఫ్ట్వేర్ జాబ్‌కు ట్రై చేయడానికి ముందు సాధారణ ఉద్యోగిగా ఉంటే సరిపోతుందని అనుకుందట. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు క్లాసికల్ మ్యూజికల్ అంటే చాలా ఇష్టం. సంప్రితి తండ్రి ఎస్బిఐ బ్యాంకులో పనిచేస్తుండగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి.