గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (19:22 IST)

కాపీరైట్ చట్టం కింద గూగుల్ సీఈవోపై ముంబైలో కేసు నమోదు

ప్రముఖ టెక్ ఇంజిన్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదైంది. కాపీరైట్ చట్టం కింద ఈ కేసును ముంబై పోలీసులు నమోదు చేశారు. బాలీవుడ్ నిర్మాత సునీల్ దర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాపీరైట్ చట్టం కింద సెక్షన్లు 51, 63, 69 కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. యూట్యూబర్ గౌతమ్ ఆనంద్ సహా ఆరుగురిపై ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. గత 2017లో విడుదలైన "ఏక్ హసీనా థీ ఏక్ దీవానా థా" చిత్రానికి సంబంధించి కేసు నమోదు చేశారు. 
 
దీనిపై సునీల్ దర్శన్ స్పందిస్తూ, తన సినిమాను యూట్యూబ్‌లో అనధికారికంగా అప్‌లోడ్ చేశారని దాన్ని గూగుల్ అనుమతించిందని చెప్పారు. ఈ విషయంపై ఈమెయిల్ ద్వారా వారిని పలుమార్లు సంప్రదించినప్పటికీ వారి నుంచి సమాధానం రాలేదని చెప్పారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు.