జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ ఎంపీ ఇంటికి నిప్పు.. ఉద్రిక్తత
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అల్లరి మూకలు మరోమారు రెచ్చిపోయాయి. కర్ఫ్యూ ఎత్తివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులు అధికార పిడిపి ఎంపీ నజీర్ లావే ఇంటికి న
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అల్లరి మూకలు మరోమారు రెచ్చిపోయాయి. కర్ఫ్యూ ఎత్తివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులు అధికార పిడిపి ఎంపీ నజీర్ లావే ఇంటికి నిప్పు పెట్టారు.
దక్షిణ కాశ్మీర్ ఎంపీ అయిన నజీర్ లావేకు కుల్గామ్‌లోని చావల్గామ్ గ్రామంలో ఇల్లుంది. ఆందోళనకారులు ఈ ఇంటినే తగులబెట్టారు. ఆందోళనకారులు తొలుత ఎంపీ గార్డు రూమ్‌కు నిప్పు పెట్టి... ఆ తర్వాత ఇంటికీ నిప్పంటించారు.
ఇంటికి నిప్పు పెట్టిన సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో కుల్గామ్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భద్రతా బలగాలను భారీగా మొహరించారు. కాగా, ఈ రాష్ట్రంలో 53 రోజుల పాటు కర్ఫ్యూను కొనసాగించిన విషయం తెల్సిందే.