శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 31 మే 2024 (14:21 IST)

కన్యాకుమారిలో 45 గంటలపాటు ఆహారం తినకుండా ప్రధాని మోడి ధ్యానం

Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటలపాటు ధ్యాన ముద్రలో మునిగివున్నారు. భారతదేశ తత్వవేత్త-సన్యాసి స్వామి వివేకానంద విగ్రహం ముందు ప్రధాని మోదీ శనివారం సాయంత్రం వరకు ధ్యానం చేయనున్నారు. 1892లో స్వామి వివేకానంద భారతదేశ భవిష్యత్తు గురించి స్పష్టమైన దర్శనం కోసం ధ్యానం చేసిన ప్రదేశమైన ధ్యాన మండపం వద్ద ప్రధాన మంత్రి ధ్యానం చేస్తున్నారు. ధ్యాన సమయంలో ఆయన మంచినీళ్లు, కొబ్బరినీళ్లు వంటి కేవలం ద్రవాహారం మాత్రమే సేవించనున్నారు.
 
ఈ ప్రదేశం హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రదేశమైన కన్యాకుమారి. ఈ ప్రదేశం జాతీయ ఐక్యత సందేశాన్ని ఇస్తుందని బిజెపి నాయకులు అన్నారు. సూర్యునికి ప్రార్థనలు చేసే ఆచారమైన 'సూర్య అర్ఘ్య'ను కూడా ప్రధాని మోదీ నిర్వహించారు.
 
తాజా లోక్ సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలుపొందాలనే లక్ష్యంతో ప్రధాని గురువారం సాయంత్రం కన్యాకుమారి చేరుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు, ప్రధాని మోదీ ఉత్తరాఖండ్‌లో ఇలాంటి ఆధ్యాత్మిక యాత్రను చేసారు. ఆ సమయంలో ఆయన కేదార్‌నాథ్ సమీపంలోని పవిత్ర గుహలో ధ్యానం చేసారు.