సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (17:25 IST)

ఇక తెలుగులో ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్.. మరో ఐదు భాషల్లో కూడా...

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెబ్‌సైట్ ఇకపై తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఒక్క తెలుగులోనే కాకుండా మరో ఐదు ప్రాంతీయ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని పీఎంఓ అధికారులు అధికారికంగా వెల్లడించారు. 
 
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం ఈ వెబ్‌సైట్లను ప్రారంభించారు. ఆమె ప్రారంభించిన వెబ్‌సైట్లలో తెలుగుతో పాటు.. తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషలు ఉన్నాయి. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని మోడీ ఆలోచనల్లో భాగంగానే ఈ వెబ్ సైట్లను ప్రారంభించినట్లు చెప్పారు. మిగతా ప్రాంతీయ భాషల వెబ్‌సైట్లను కూడా రూపొందించి, త్వరలోనే వాటిని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కొత్తగా ప్రారంభించిన ఆయా సైట్ల వివరాలు...
 
తెలుగు - www.pmindia.gov.in/te
తమిళం - www.pmindia.gov.in/ta 
మలయాళం - www.pmindia.gov.in/ml
మరాఠీ - www.pmindia.gov.in/mr
బెంగాలీ -www.pmindia.gov.in/bn
గుజరాతీ - www.pmindia.gov.in/gu