సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (23:21 IST)

పోలీస్ వర్సెస్ ట్రాఫిక్ పోలీస్.. రూల్స్ అందరికీ సమానమే.. వీడియో వైరల్

పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు మధ్య గొడవ జరిగింది. ఇదేంటి అనుకుంటున్నారా.. అయితే చదవండి మరి. రూల్స్ సామాన్య ప్రజలకే కాదు.. పోలీసులకు కూడా అనేది నిరూపించారు. 
 
రూల్స్ ప్రజలకు మాత్రమే.. పోలీసులకు కాదు.. అనే మాట వినే వుంటాం. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కొందరు మాత్రం రూల్స్ కరెక్ట్ గా ఫాలో అవుతుంటారు. ఎవరెటుపోయినా నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదలరు.
 
రాంచీలో ఓ ట్రాఫిక్ పోలీస్ రూల్స్ కోసం చేసిన ఫీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక సివిల్ పోలీస్ రూల్ బ్రేక్ చేసి వెళ్తుంటే ఆపిన ట్రాఫిక్ పోలీస్ పై దాడికి దిగాడు. 
 
ఒకరినొకరు కొట్టుకుంటూ కాసేపటి వరకూ ఫైటింగ్ చేసుకున్నారు. జార్ఖండ్ లోని రాంచీ ప్రాంతంలో సెహెజానంద్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.