సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (16:24 IST)

కర్ణాటక రైతులా మజాకా.. మొసలితో రోడ్డుపైకొచ్చారు..

crocodile
కర్ణాటక రైతులు కరెంటు కోతలపై భగ్గుమంటూ.. ఏకంగా మొసలితో నిరసన చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. తమకు కనీసం రోజుకు 5 గంటలు కూడా కరెంటు సరఫరా చెయ్యట్లేదని ఆగ్రహించిన రైతులు.. కరెంటు ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. 
 
రైతులు తమతోపాటూ.. పురుగు మందు డబ్బాలు, ఎండిపోయిన వరి మొక్కలను తీసుకొచ్చారు. పోలీసులు రైతులను రోడ్డుపై నుంచి పంపేయాలని ప్రయత్నించారు. 
 
దీంతో ఆగ్రహించిన రైతులు.. విజయాపూర్ జిల్లాలోని హెస్కామ్ కరెంటు ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. కానీ పోలీసులు బలంగా అడ్డుకున్నారు.