శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (08:00 IST)

ప్రియురాలితో జల్సా.. కళ్లారా చూసిన భార్య.. రూ.5 లక్షలకు అమ్మేసింది..

woman
ఏదో సినిమాలో కోటి రూపాయల కోసం భర్తను అమ్మేసిన కథను వినే వుంటాం. అలాంటి ఘటనే తాజాగా రియల్ లైఫ్‌లో కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ మహిళ తన భర్తను ఆయన ప్రియురాలికి రూ.5లక్షలకు అమ్మేసింది.  మండ్యకు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే, మండ్య గ్రామంలో ఓ గృహిణి తన భర్త మరో మహిళతో ప్రేమలో వున్న విషయం తెలిసి షాక్ కాలేదు. వారిద్దరూ పడక గదిలో వుండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
 
ఆపై ఆలోచించి ఇక లాభం లేదనుకుని.. గృహిణికి ఆమె భర్తను అప్పగించాలంటే తనకు అతడు బాకీ పడ్డ రూ.5 లక్షలు చెల్లించాలని ప్రియురాలు షరతు పెట్టింది. 
 
ఇలాంటి భర్త తనకొద్దన్న గృహిణి తనకే రూ.5 లక్షలు మనోవర్తి కింద ఇస్తే తన భర్తను ఆమెకు వదిలేసేందుకు సిద్ధమని చెప్పింది. 
 
దీంతో ప్రియురాలు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించడంతో భర్తను అమ్మేసే తంతు కూడా పూర్తయ్యింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.