Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

పోలీసులకు బాగా మందు పోసి, అక్కడి నుండి పరారైన ఖైదీ..

Written By మోహన్
Updated: శుక్రవారం, 29 మార్చి 2019 (18:27 IST)
చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం గుర్తుందా? ఆ చిత్రంలో హీరో పోలీస్ స్టేషన్‌లో పోలీసులను చితక్కొట్టి బయటకు వస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. అయితే ఇప్పుడు ఓ ఖైదీ పోలీసులకు మందు తాగించి అక్కడి నుండి పరారైయ్యాడు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఓ ఖైదీ పోలీసుల బంధీ నుండి చాలా తెలివిగా పరార్ అయ్యాడు. సదరు ఖైదీ ఓ లాయర్ హత్య కేసు, దోపిడీ కేసుతో పాటు మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడే గ్యాంగ్‌స్టర్‌ బద్దాన్‌ సింగ్‌. తాజాగా ఇతడు పోలీసుల కస్టడీ నుండి జంప్ అయ్యాడు. 1996 సంవత్సరంలో ఓ లాయర్‌ను హత్య కేసులో బద్దాన్‌ సింగ్‌ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 
 
కాగా ఫతేఘర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న బద్దాన్‌ను ఓ కేసు విచారణ విషయంలో గజియాబాద్‌‌కి తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేసారు. అయితే బద్దాన్ మాత్రం వారికి మందు దావత్ ఏర్పాటు చేసానని ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను నమ్మించి మీరట్‌లోని ఓ హోటల్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బద్దాన్‌ తన అనుచరులతో పోలీసులకు మందు దావత్ ఏర్పాటు చేసారు. 
 
ఇక పోలీసులు అదే అదునుగా ఫుల్లుగా తాగి ఉండడం చూసిన బద్దాన్ అక్కడి నుండి మెల్లగా జారుకున్నాడు. కాగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఏడుగురిలో ఓ ఇన్‌స్పెక్టర్‌ కూడా ఉన్నాడు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments