శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (14:08 IST)

విద్యార్థినిని పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిగా మారిన అమ్మాయి.. ఎక్కడ?

leady teacher
తన వద్ద చదువుకునే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు పీఈటీ ఉపాధ్యాయురాలు ఒకరు ఏకంగా లింగ మార్పిడి చేసుకుని అబ్బాయిగా మారింది. ఆ తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకుని సంసార జీవితాన్ని గడుపుతున్నారు. ఈ ఆశ్చర్యకర ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భరత్‌పూర్‌లోని ఓ పాఠశాలలో మీరా కుంతల్ అనే ఉపాధ్యాయురాలు పీఈటీ మాస్టరుగా పని చేస్తున్నారు. ఇదే స్కూల్‌లో కల్పనా ఫౌజ్దార్ అనే విద్యార్థి చదువుతోంది. ఈ విద్యార్థినితో మీరా ప్రేమలోపడింది. పైగా, కల్పనాను పెళ్లి చేసుకోవాలన్న బలమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంతో రిస్క్ తీసుకుని లింగ మార్పిడి చేసుకుని పురుషుడుగా మారింది. 
 
దీంతో మీరా (ఆమె) కాస్త ఇపుడు అబ్బాయి (ఆరవ్ కుంతల్)గా మారిపోయాడు. ఆ తర్వాత తన ప్రియురాలు కల్పనా పెళ్లి చేసుకున్నారు. స్కూల్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసుల సందర్భంగా మీరా (ఆరవ్), కల్పనల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 
 
దీనిపై ఆరవ్ మాట్లాడుతూ, అమ్మాయిగా పుట్టినప్పటి నుంచి తాను అబ్బాయిగా మారాలని అనుకునేవాడినని, ఈ క్రమంలో తొలిసర్జరీ 2019లో చేయించుకున్నట్టు చెప్పారు. తద్వారా తన ప్రేమను కూడా నిజం చేసుకున్నట్టు ఆరవ్ చెప్పాడు. 
 
కల్పనా మాట్లాడుతూ, ఆరవ్‌తో చాలా యేళ్లుగా తాను ప్రేమలో ఉన్నానని, ఆరవ్ లింగ మార్పిడి చేయించుకోకపోయినా అతడినే పెళ్లి చేసుకునేదాన్నని తెలిపింది. కాదా, వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడం గమనార్హం.