శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (13:20 IST)

అమావాస్య రోజు ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకున్నాడు.. ఎవరు?

Suraj Revanna
కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. అసహజ లైంగిక దాడికి సంబంధించిన కేసులో రేవణ్ణ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన సూరజ్ రేవణ్ణ.. మహిళలా ప్రవర్తించే వాడని.. అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు జరుపుతున్న సీఐడీ అధికారులు గుర్తించారు. 
 
ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు దీనిపై మాట్లాడుతూ.. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయం అయ్యాడని.. అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకుని.. విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపాడు. నిత్యం వాట్సాప్‌లో మెసేజ్‌తో పాటు హార్ట్ ఎమోజీలను పంపేవాడని తెలిపాడు. 
 
ఒకసారి ఫాం హౌస్‌కు పిలిపించుకుని కాళ్లు ఒత్తమని కోరాడని.. ఆ తర్వాత బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించాడు. సూరజ్ రేవణ్ణ చీరకట్టుకుని, గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ ఫోన్‌లో వున్నాయని తెలిపాడు. ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. 
 
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 2018 మార్చి 4న సూరజ్ - సాగరిక రమేష్‌ల వివాహం జరిగింది. వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు. భార్యతోనూ అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకులు తీసుకుంది.