సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (17:15 IST)

గురువారం, జూన్ 6, 2024.. వటసావిత్రి, రోహిణి వ్రతం.. ఒకేరోజు ఆ నాలుగు?

Puja
జ్యేష్ట కృష్ణ పక్ష అమావాస్య. జూన్ 06, 2024న రోహిణి వ్రతం, అమావాస్య, వట సావిత్రి వ్రతం, శని జయంతి అన్నీ కలిసి వస్తున్నాయి. రోహిణి వ్రతం రోజున ఉపవాసం పాటించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహనను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. 
 
భర్త దీర్ఘాయువు, భర్త శ్రేయస్సు కోసం ప్రార్థించడానికి మహిళలు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటారు. పూజ అనంతరం మార్గశీర్ష నక్షత్రం ఉదయించే వరకు ఉపవాసం ఉంటారు. భక్తులు చేతనైనంత దానధర్మాలు చేస్తూ రోజును ముగించుకుంటారు. 
 
ఇక మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజచేయడం ద్వారా జరుపుకుంటారు.
 
వటవృక్షం అనగా మర్రిచెట్టు. భారతీయుల జాతి వృక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు కొమ్మలు శివునికి నివాసస్థలాలు. ఈ వ్రతం రోజు సుమంగళులు వటవృక్షాన్ని పసుపు, కుంకుమలతో, అక్షతలతో పూజిస్తారు. వటవృక్షాన్ని పువ్వులతో అలంకరించి, గాజులు మొదలైన అలంకరణ సామాగ్రిని సమర్పించి ధూప, దీప, నైవేద్యాలతో పూజిస్తారు.
 
తరువాత వటవృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేసేటప్పుడు ముడిప్రత్తి నుండి వడికి తీసిన దారాన్ని వృక్షం చుట్టూ చుట్టుకుంటూ వెళ్తారు. వటవృక్షం యొక్క దీర్ఘాయుర్దాయంతో తమ భర్తల ఆయుష్షును బంధించడమే ఇలా దారం చుట్టడంలోని అంతరార్థంగా కన్పిస్తుంది. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసట బొట్టు పెట్టి గౌరవిస్తుంది.
 
ఇకపోతే.. ఇదే రోజున అమావాస్యతో కూడిన శని జయంతి కావడంతో.. జ్యేష్ఠ అమావాస్య నాడు..పితరులను పూజించాలి. ఇంకా శనిపూజ చేయాలి. నువ్వుల దీపం వెలిగించాలి. జ్యేష్ఠ అమావాస్య నాడు అన్నదానం, దుస్తులు దానం ఇవ్వాలి. శివరాధన జ్యేష్ఠ అమావాస్య నాడు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.   
 
శుభ కాలం
అభిజిత్ ముహూర్తం - 11:58 AM - 12:52 PM
అమృత్ కాలం - 05:12 PM - 06:44 PM
బ్రహ్మ ముహూర్తం - 04:08 AM – 04:56 AM
 
ఈ వేళల్లో దేవతా పూజ, పితృపూజ చేయడం మంచిది.