మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (16:20 IST)

ఫ్లైట్ టాయిలెట్‌లో శృంగారంలో మునిగితేలిన జంట...

romance
చాలా మంది విమాన ప్రయాణ సమయంలో సినిమాలు లేదా ఇయర్ ఫోనులో తమకు నచ్చిన పాటలు వింటూనో ప్రయాణ సమయాన్ని గడిపేస్తుంటారు. మరికొందరు విమానమెక్కగానే తమ సీట్లలో హాయిగా నిద్రపోతారు. ఏ విమానంలోనైనా సర్వసాధారణంగా కనిపించే విషయం ఇదే. అయితే, లండన్‌లో మాత్రం ఓ జంట ఏకంగా ఫ్లైట్ టాయిలెట్ లోనే శృంగారంలో నిమగ్నమైపోయింది. 
 
ఒకే టాయిలెట్ లోకి ఇద్దరూ వెళ్లడం, ఎంతకీ బయటకు రాకపోవడంతో ఫ్లైట్ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో బాత్రూమ్ వద్దకు వెళ్లి ఆ జంటను బయటకు రావాలని పిలిచినా వారు స్పందించలేదు. దీంతో బయట నుంచి డోర్ ఓపెన్ చేయగా, లోపల కనిపించిన దృశ్యం చూసి ఫ్లైట్ సిబ్బందితో పాటు అక్కడికి దగ్గరులో కూర్చున్న ప్రయాణికులు అవాక్కయ్యారు.
 
లోపల శృంగారం జరుపుతున్న యువకుడు వెంటనే డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అయితే, ఇదంతా ఓ ప్రయాణికుడి సెల్ ఫోన్‌లో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నెల 8న లండన్‌లోని లూటన్ సిటీ నుంచి లిబిజా ఐలాండ్ కు వెళుతున్న తమ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఈజీ జెట్ సంస్థ వెల్లడించింది. 
 
మొత్తం రెండున్నర గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో ఓ జంట అసభ్యంగా ప్రవర్తించిందని, లిబిజా ఐలాండ్‌పోలీసులకు అప్పగించామని తెలిపింది. అయితే, ఆ జంటను పోలీసులు అరెస్టు చేశారా? లేక హెచ్చరించి వదిలేశారా? అనే వివరాలను ఎయిర్ లైన్స్ సంస్థ వెల్లడించలేదు.