సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (16:08 IST)

ఉత్తరాఖండ్‌లో తుఫాన్ బీభత్సం- తెహ్రి సరస్సు వద్ద అల్లకల్లోలం

Uttarkhand
ఉత్తరాఖండ్‌లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ తుఫాను కారణంగా, తెహ్రి డ్యామ్ వద్ద ఉన్న బోటింగ్ పాయింట్‌లో 40 బోట్లు దెబ్బతిన్నాయి. 
 
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెహ్రి సరస్సు వద్ద.. అలాగే పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం బోటింగ్ ఆపివేశారు. ఆరు సంవత్సరాల తర్వాత తెహ్రీ సరస్సులో ఇంత భయంకరమైన తుఫాను వచ్చిందని స్థానికులు తెలిపారు. 
 
సరస్సులో తుఫాను కారణంగా బోటులో వున్న ప్రయాణీకులను బోటు డ్రైవర్లు తీవ్రంగా శ్రమించి ఒడ్డుకు చేర్చారు. తెహ్రీ లేక్ డెవల్మప్ మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బోటు డ్రైవర్లు ఆరోపించారు. 
 
దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లించాలని బోట్ నిర్వాహకులు ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నారు. సరస్సులో జెట్టీల సంఖ్యను పెంచాలని వారు కోరుతున్నారు.