సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (23:46 IST)

ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు అలా కూర్చోబెడితే...? స్మృతి ఇరానీ

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో బకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పెళ్లి, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్మృతీ ఇరానీ పోస్ట్ చేశారు. శుక్రవారం ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్.. ముఖ్యమైన సందేశాన్ని కూడా తెలియజేసేలా ఉంది.
 
వివాహం విషయానికొస్తే.. ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఇట్టే గ్రహించవచ్చు అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో స్మృతీ ఇరానీ తెలిపారు. 
 
అయితే ఆమె మరో పోస్ట్ కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ.. ఏ పదార్థమూ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.