అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు: కేంద్ర హోంశాఖ కార్యదర్శి
అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
నల్లబజార్లలతో నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరలు పెంచడం వంటి కార్యక్రమాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని, ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
డీలర్లపై నిఘా పెంచడంతోపాటు వారి అకౌంట్లను నిత్యం పరిశీలించాలన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని. దీనికిగానూ ఏడేళ్ల జైలు శిక్ష ఉన్నట్లు గుర్తు చేశారు.
జూన్ 30 వరకు నిత్యావసరాల చట్టం అమలులో ఉంటుందని. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా ప్రచారం చేయాలన్నారు. ఆహార, నిత్యావసర ఉత్పత్తి సంస్థల్లోని కార్మికుల కొరత, ముడి సరకు సరఫరాపై దృష్టి సారించాలని ఆయన కోరారు.