శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (20:04 IST)

వృద్దాప్య పింఛన్లు హాంఫట్.. కొత్తగా మంజూరైన పింఛన్లో దళారుల చేతివాటం

కొత్తగా మంజూరైన పింఛన్‌దారులు ఒక్కొక్కరి దగ్గరి నుండి సుమారుగా రూ. 1250 వసూళ్ల వ్యవహారం బయటకి పొక్కడంతో నాయకులు కల్పించుకొని తిరిగి ఇప్పించారు. 
 
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తల్వాయిపాడు గ్రామం అక్రమాలకు అడ్డాగా మారింది. ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి పేద ప్రజలకొరకు తలకుమించిన భారమైనా కూడా ఎంతో బాధ్యతతో ఇంటింటికి పింఛన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
కానీ కొందరు దళారులు మేము మీకు పింఛన్లు రావడానికి సహాయం చేసామనే నెపంతో ఒక్కొక్కరి దగ్గర సుమారుగా రూ. 1250/- వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాట ఆనోటా ఈనోట పొక్కి  విషయం బయటకు రావడంతో  విషయం పెద్దది అవుతుందని భావించిన పెద్దమనుషులు కల్పించుకొని పింఛన్‌దారులకు కొంతమందికి వారి సొమ్ము తిరిగి ఇప్పించారని సమాచారం. 
 
దీనిపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని అన్నారు. వివరాలు సేకరించి తగు చర్యలకై ఉన్నతాధికారులకు తెలియ జేస్తామని చెప్పారు. 
 
గ్రామస్థులు కొందరు దీనిపై వాలంటైర్‌ని ప్రశ్నించగా తనకు తెలియదని,, వారి దగ్గర బయటి వ్యక్తులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.