కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులు.. స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని..

smart phone
smart phone
సెల్వి| Last Updated: శనివారం, 1 ఆగస్టు 2020 (10:29 IST)
కరోనా కాలంలో పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులు కొందరి విద్యార్థుల జీవితాల్లో తంటాలు తెచ్చిపెడుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలను బలిగొంటున్నాయి.

నిరుపేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో.. ఆన్‌లైన్ క్లాసులను వినడం ఇబ్బందిగా మారింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు లేక, క్లాసులు వినలేక సతమతమై క్షణికావేశంలో ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కుడలూరు జిల్లాకు చెందిన ఓ 14 ఏళ్ల విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో తమిళనాడు స్కూళ్లన్నీ ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించాయి. అయితే ఈ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో క్లాసులను వినడం లేదు. తనకు ఫోన్ కొనివ్వమని తండ్రిని అడిగాడు. జీడిపప్పు పండించే ఆ విద్యార్థి తండ్రి.. అది అమ్ముడుపోగానే ఫోన్ కొనిస్తానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీనిపై మరింత చదవండి :