ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (10:04 IST)

పెళ్లింట విషాదం... ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం

housefire
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. తాళం వేసివున్న ఇంట్లో ముగ్గురు తోబుట్టువులు సజీవదహనమయ్యారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంటి మృత్యు ఘంటికలు మోగాయి. పెళ్లికుమారుడు సహా అతడి ఇద్దరి సోదరీమణులు.. అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అదీకూడా సజీహ దహనమైన కనిపించారు. పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌లో ఈ ఘటన జరిగింది. 
 
మృతులను మంగళ్‌ సోరెన్‌ (33), సుమీ సోరెన్‌ (35), బహమనీ సోరెన్‌ (23)గా పోలీసులు గుర్తించారు. దుర్గాపుర్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న హఫ్నా సోరెన్‌ కుమారుడు మంగళ్‌ సోరెన్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఆదివారం.. వధువు తరపు కుటుంబసభ్యులు మంగళ్‌ ఇంటికి వచ్చి వివాహ ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. ఈ కారణంగానే మంగళ్‌ సోదరీమణులు సుమీ, బహమనీ శుక్రవారం పుట్టింటికి వచ్చారు. 
 
సుమీ సోరెన్‌ కోల్‌కతాలో నర్సుగా పనిచేస్తుండగా.. బహమనీ గృహిణి. వీరి తండ్రి శనివారం తెల్లవారుజామున ఏదో పని మీద మార్కెట్‌కు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి మంటలు వస్తున్నాయి. వెంటనే తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. కుమారుడు, ఇద్దరు కూమార్తెలు విగతజీవులుగా పడున్నారు. హఫ్నా ఇంట్లో ఎటువంటి సమస్యలు లేవని, అసలేం జరిగిందో తెలియట్లేదని స్థానికులు తెలిపారు.