శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:45 IST)

తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి ట్రాన్స్‌జెండర్ గెలుపు

Ganganayak
తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారి డీఎంకే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ గెలుపును నమోదు చేసుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. 
 
తమిళనాడు వెల్లూరు నుంచి 37వ వార్డుగా పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి గంగానాయక్ విజయం సాధించడం పట్ల ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది.
 
గంగానాయక్ దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం గంగానాయక్ ఓ నాటక బృందాన్ని నడుపుతున్నారు. 
 
ఇందులో 50 మంది పనిచేస్తున్నారు. ఈ 50 మందిలో 30 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. కాగా ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు.