పారిపోతున్న బెంగాల్ గర్ల్స్... పవర్‌ఫుల్ రైల్ నెట్వర్క్‌తో పట్టుకున్న రైల్వేమంత్రి సురేష్ ప్రభు...
ఇప్పటివరకూ అతిపెద్ద భారత రైల్వే మంత్రులుగా పనిచేసినవారు వేరు... ఇప్పుడు రైల్వేమంత్రిగా పనిచేస్తున్న సురేష్ ప్రభు వేరు. ఆయనకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు... రైళ్లలో ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. అలాంటి సమస్యను పగడ్బందీగా పరిష్కరించారు సురేష
ఇప్పటివరకూ అతిపెద్ద భారత రైల్వే మంత్రులుగా పనిచేసినవారు వేరు... ఇప్పుడు రైల్వేమంత్రిగా పనిచేస్తున్న సురేష్ ప్రభు వేరు. ఆయనకు ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు... రైళ్లలో ఏ సమస్య అయినా ఇట్టే తీరిపోతుంది. అలాంటి సమస్యను పగడ్బందీగా పరిష్కరించారు సురేష్ ప్రభు. కాకపోతే ఇది రైళ్లకు సంబంధించిన సమస్య కాదు. తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్య. వివరాల్లోకి వెళితే... ఇటీవల విడుదలయిన 12 సీబీఎస్ఈ పరీక్షల్లో తమకు మార్కులు తక్కువ వచ్చాయని ఇద్దరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులతో చెప్పకుండా రైలెక్కి ముంబై పారిపోతున్నారు.
తమ కుమార్తెలు కనిపించడంలేదంటూ సదరు విద్యార్థునుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ముంబై వెళ్లే రైలు ఎక్కినట్లు సమాచారం తెలుసుకున్నారు. అంతే... ఇక ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేశారు. తమ పిల్లలు రైలెక్కి ముంబై పారిపోతున్నారని, కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అంతే.... సురేష్ ప్రభు అలెర్ట్ అయ్యారు. టెక్నాలజీతో అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇంకేముంది... ఆ ఇద్దరి విద్యార్థులు ముంబైకి మరో మూడు గంటల్లో చేరుతారనగా నాశిక్ రోడ్ స్టేషను వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమార్తెలను తిరిగి తమ ఇంటికి చేర్చినందుకు మంత్రి సురేష్ ప్రభుకు విద్యార్థునుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తమ్మీద సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా బాధ్యత చేపట్టిన దగ్గర్నుంచి రైల్వేల రూపురేఖలు మారిపోతున్నాయి. హ్యాట్సాఫ్ సురేష్ ప్రభు.