సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 నవంబరు 2019 (16:48 IST)

ఆధార్ మార్పులు : పరిమితులు విధించిన కేంద్రం

ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ఇప్పటివరకు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులకు ఎలాంటి షరతులు లేవు. కానీ, ఆధార్ కార్డులో పలుమార్లు మార్పులు చేర్పులు చేసి దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. వీటికి చెక్ పెట్టేందుకు వీలుగా ఇపుడు పరిమితులు విధించింది. 
 
తాజా పరిమితుల మేరకు.. నిర్దేశించిన మేరకు మాత్రమే మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. కొత్త నియమావళి ప్రకారం.... పేరును సరిచేసుకోవడానికి రెండు అవకాశాలు మాత్రమే ఇస్తారు. పుట్టినరోజు తేదీలు, లింగం మార్చుకోవాల్సి వస్తే ఒక్కసారే అవకాశం ఉంటుంది. 
 
ఒకవేళ సూచించిన మేర కంటే ఎక్కువసార్లు మార్పులు చేసుకోవాల్సి వస్తే సమీప ఆధార్ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులకు తగిన కారణాలు వివరించాలి. మార్పులు చేర్పులకు సంబంధించిన ఆధారాలను పోస్టు ద్వారా, లేకపోతే ఈ-మెయిల్ ద్వారా అధికారులకు పంపాలి.