గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2022 (21:48 IST)

ఫ్యానుకు ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. వీడియో తీసిన భర్త

భర్త కళ్ల ఎదుటే భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ భర్త పట్టించుకోలేదు. పైగా భార్య ఆత్మహత్యను మొబైల్‌ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. అనంతరం భార్య ఆత్మహత్య విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సంజయ్ గుప్తా, శోబితా గుప్తాలకు ఐదేళ్ల కిందట వివాహమైంది. మంగళవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన శోబితా, భర్త సంజయ్‌ ఎదుటే ఆత్మహత్యకు పాల్పడింది.
 
బెడ్‌ రూమ్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అయితే భర్త ఆమెను నిలువరించలేదు. ఇంకా తన మొబైల్‌లో ఈ తతంగాన్ని వీడియో రికార్డు చేశాడు. ఆమె చనిపోయిన విషయాన్ని అత్తింటి వారికి సమాచారం ఇచ్చాడు.  
 
అలా ఇంటికి వచ్చిన అత్తారింటి వారికి భార్య ఆత్మహత్య చేసుకుంటుండగా రికార్డు చేసిన వీడియోను చూపించాడు. శోబితా తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో శోబితా కుటుంబ సభ్యులు సంజయ్‌ గుప్తాపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.