శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:06 IST)

భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది.. అయినా అలా జరిగింది..?

భర్తను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది ఆ వివాహిత.  ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత వద్ద ఆమె పిల్లలను అప్పగించి.. అతనితోనే పోలీసులు  పంపించేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ, గోరఖ్‌పూర్‌కు సమీపంలో హర్‌పూర్‌కు చెందిన వివాహిత అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరు పిల్లల్ని, భర్తను వదిలి ప్రియుడితో పారిపోయింది. దీంతో ఆ మహిళ భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ జంటను పట్టుకున్నారు. పంచాయతీ పెట్టారు. 
 
చివరికి ఆ వివాహిత భర్త ప్రవర్తన నచ్చలేదని.. అందుకే ప్రియుడితో కలిసి వెళ్లిపోయానని ఆ మహిళ చెప్పింది. తన పిల్లలను తనకు అప్పగించమని కోరింది. పిల్లలను చూసుకుంటానని ఆమె ప్రియుడు కూడా పోలీసులకు చెప్పాడు. దీంతో ఇద్దరు పిల్లలను కూడా పోలీసులు ఆమెకే అప్పగించారు. షాకైన భర్త కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు.