సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (20:11 IST)

అసెంబ్లీలో బ్లూఫిల్మ్ చూస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

bjp mla tripura
త్రిపుర అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అడ్డంగా బుక్కయ్యారు. ఒకవైపు రాష్ట్ర బడ్జెట్‌పై రసవత్తర చర్చ జరుగుతుంటే మరోవైపు సదరు ఎమ్మెల్యే అశ్లీల వీడియోలు చూస్తూ చిక్కిపోయారు. ఈ విషయం వెలుగు రావడంతో బీజేపీ అధిష్టానం వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది. సదరు ఎమ్మెల్యే పేరు జాదల్ లాల్ నాథ్. బగ్బసా అసెంబ్లీ నియోజకవర్గం. 
 
అసెంబ్లీలో రాబడ్జెట్‌పై చర్చ జరుగుతుండగా ఆయన పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కాడు. ఆయన వెనుకాల ఉన్నవారు ఈ వీడియోను రికార్డు చేసి మీడియాకు అందించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
 
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియోపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఇది సిగ్గుచేటు అంటూ ట్వీట్ చేశారు. కాగా, ప్రజా ప్రతినిధులు ఈ తరహా వీడియోలు చూస్తూ పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సంఘటనలు ఇలాంటివి జరిగాయి.