విందులో బీఫ్ లేదు.. పెళ్ళి వద్దే వద్దు.. రద్దు చేసుకున్న వరుడు ఫ్యామిలీ.. ఎక్కడో తెలుసా?
దేశ వ్యాప్తంగా గోమాంసంపై వివాదం జరుగుతుంటే.. తాజాగా విందులో బీఫ్ పెట్టలేదని వివాహం రద్దైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీఫ్‌పై యూపీలో నిషేధం అమల్లో వున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకల
దేశ వ్యాప్తంగా గోమాంసంపై వివాదం జరుగుతుంటే.. తాజాగా విందులో బీఫ్ పెట్టలేదని వివాహం రద్దైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీఫ్‌పై యూపీలో నిషేధం అమల్లో వున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో రాంపూర్ ప్రాంతానికి చెందిన యువతీ యువకుల వివాహం బీఫ్ లేదనే కారణంతోనే రద్దు అయ్యింది.
పెళ్లి రోజు వివాహానికి ముందు భోజనాలు చేసిన వరుడి కుటుంబ సభ్యులు విందులో బీఫ్ ఏదని? ప్రశ్నిస్తూ.. కారు కట్నంగా కావాలని డిమాండ్ చేశారు. దీంతో వధువు తండ్రి యాదవ్ కారు తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ బీఫ్ మాత్రం పెట్టడం కుదరదని చెప్పేశాడు.
రాష్ట్రంలో నిషేధం అమలవుతోందని బీఫ్ దొరకదని స్పష్టం చేశాడు. దీంతో వివాహాన్ని రద్దు చేసుకుని వరుడి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. దీంతో యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. కారునైనా కొనిస్తామని.. బీఫ్ తెమ్మంటే ఎలా తెస్తామని వధువు తండ్రి వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.