డ్యాన్స్ చేస్తూ డ్రైనేజీలో పడిన వరుడు...

Last Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (18:04 IST)
ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఓ పెళ్లి కుమారుడు డ్రైనేజీలో పడిపోయాడు. బరాత్‌లో డ్యాన్స్ చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 52లో ఉన్న హోషియార్‌పూర్‌లో ఈనెల 9వ తేదీన ఓ పెళ్లి వేడుక జరిగింది. ఈ వేడుక కోసం ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసింది. బరాత్ కోసం తగిన ఏర్పాట్లు చేశారు.

పెళ్లికొడుకుని మండపం వరకు తీసుకువస్తున్నారు. బాజా భజంత్రీలు, పెళ్లికొడుకు, అతని ఫ్రెండ్స్, బంధువులు అందరూ బీభత్సంగా డ్యాన్స్‌లు చేస్తున్నారు. అయితే, పెళ్లి మండపానికి, రోడ్డుకి మధ్య ఓ చిన్న మురుగుకాలువ ఉంది. ఆ కాలువ మీద నుంచి రావడానికి చిన్న బ్రిడ్జి లాంటిది ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ బ్రిడ్జి మీద బీభత్సమైన డ్యాన్స్‌లు చేయడంతో అది ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పెళ్లికొడుకు సహా 15 మంది ఆ డ్రైనేజీలో పడిపోయారు.

పెళ్లికొడుక్కి ఘనస్వాగతం పలికేందుకు ఆ చిన్న బ్రిడ్జికి అవతలి వైపు పెళ్లికుమార్తె తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. పెళ్లికొడుకు తరపు వారి జోష్ చూసి వారు కూడా ఆనందంగానే ఉన్నారు. అయితే, వారి కళ్లముందే కాబోయే అల్లుడు అలా మురికి కాలువలో పడిపోయేసరికి వారు కూడా షాక్‌కి గురయ్యారు.దీనిపై మరింత చదవండి :