ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (19:00 IST)

కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేయాలి? (video)

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి జనజీవనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టు కనిపిస్తోంది. కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆ వైరస్ ప్రభావం మాత్రం మనుషులపై మరికొంత కాలం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో కటక్ లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలోని అనస్థీషియాలజీ మరియు క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వైద్యులు కోవిడ్ నుంచి కోలుకున్నవారు వ్యాయామాలు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న దానిపై పలు సూచనలు చేశారు. అవేంటో ఇక్కడ వివరించడమైనది.   
 
* కోవిడ్ వైరస్ సోకిన నేపథ్యంలో చాలా రోజులు లేదా వారాల తరబడి శారీరక శ్రమ లేకుండా మంచానికే పరిమితమై ఉంటారు. దీంతో మన కండరాలు, మన శరీరం కొన్ని భౌతికంగా కొన్ని కదలికలు, పనులు చేయడానికి అలవాటుపడవు. 
 
* మీరు కోవిడ్ సమయంలో కోల్పోయిన శక్తిని తిరిగి తెచ్చుకునేందుకు కొన్ని వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు, వారానికి ఐదు రోజులపాటు వ్యాయామం చేయడం వల్ల మీరు కోల్పోయిన బలాన్ని తిరిగి పొందవచ్చు. తద్వారా మీ శ్వాసప్రక్రియ కూడా మెరుగుపడుతుంది.
 
* ప్రస్తుతం మీరు కోవిడ్ నుంచి కోలుకునే దశలో ఉంటారు కాబట్టి వ్యాయామంలో ఏది సాధ్యమో అది చేయండి. ఉదాహరణకు నిలబడి అయినా లేదా కూర్చుని కూడా వ్యాయామాలు చేయవచ్చు. 
 
* వ్యాయామం చేయడానికి ఐదు నిమిషాలు కేటాయించండి. ఆ తర్వాత కుర్చీలో కూర్చొని మీ భుజాలను పైకి, కిందకు కదలించండి. ఆ తర్వాత మీ మోకాలిని పైకి ఉంచి, పాదాన్ని (చీలమండ), చేతి మణికట్టును ఇరువైపులా అటు ఇటూ తిరిగేలా చేయాలి.
 
* కవాతు చేయడం వంటి వ్యాయామాలు కూడా మీరు అక్కడికక్కడే చేసుకోవచ్చు. ఉదా: 
 
మీరు మీ ఇంటి మెట్ల మీద ఒక మెట్టుపైకి కిందకి ఎక్కడం (అవసరమైతే హ్యాండ్ రోల్ ను పట్టుకోవచ్చు). లేదా అరుబయట నడవడం లాంటి గుండె సంబంధిత వ్యాయాయాలు చేయవచ్చు. 
 
* శక్తిని పెంచే వ్యాయామాలైన వాల్ పుషప్స్ చేయాలి. ( నేలకి బదులుగా గోడపై మీ చేతులను ఉంచడం ద్వారా స్టాండింగ్ పుషప్స్ చేయడం) 
 
* గోడకు వీపును ఆనించి గుంజీలు తీసిన విధంగా కిందకూ పైకి లేవడం
 
* వారానికి మూడు సార్లు స్ట్రెచ్చింగ్ ఎక్సర్ సైజులు చేయడం అలవాటు చేసుకోండి. ఇందులో భాగంగా ముందుగా మీరు మూడు వ్యాయామాలను ఎంచుకుని ఒక్కొక్కదాన్ని 10సార్లు చేయండి. అలా క్రమక్రమంగా బరువుతోపాటు ఎక్కువసార్లు చేస్తూ వెళ్లండి
 
* ఎల్లప్పుడూ స్ట్రెచ్చింగ్ ఎక్సర్ పైజ్ లతో వ్యాయామం ముగించండి. ఉదాహరణకు, మీరు మీ చేతులను భుజాల వరకు ఇరువైపులా తిప్పండి. ఆ తర్వాత మీ అరచేతులను పైకి, కిందికి తిప్పండి
 
* ఇవి మీరు వ్యాయామాన్ని తిరిగి ప్రారంభించడానికి చేస్తున్న కొన్ని సూచనలు. మీరు ఇతర వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు.
 
* మీరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు అలసిపోయినట్టు అనిపించకపోతే ఉదయం పూట కొన్ని నిమిషాలపాటు నడవడం మంచిది. 
 
* వ్యాయామం చేస్తున్న సమయంలో కొంచెం ఆయాసంగా అనిపించడం సాధారణ ప్రక్రియే అని గుర్తించుకోండి.
 
* మీరు వ్యాయామం చేస్తున్న పరిసరాల్లో మాట్లాడేటప్పుడు కొంత ఇబ్బందిగా అనిపించినా భయపడవద్దు. 
 
* కానీ మరీ రెండు రెండు పదాలు కూడా మాట్లాడలేకపోయినట్టయితే మీరు చేస్తున్న వ్యాయామాల్లో వేగాన్ని తగ్గించండి తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా శరీరం దృఢంగా తయారయ్యి స్వాధీనం లోకి వస్తుంది!