ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (15:34 IST)

ఉద్యోగం నుంచి తీసేస్తారా? డాబా మీద నుంచి దూకేస్తాను (వీడియో)

ఉద్యోగం నుంచి తొలగించిన కారణంగా.. కార్యాలయం డాబాపైకి ఎక్కిన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హర్యానా, గుర్గామ్‌లోని ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీలో పనిచేస్తూ వచ్చిన ఓ యువతిని సదరు సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి కార్యాలయం డాబాపైకెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతానని బెదిరించింది. 
 
డాబా పైన ఆ యువతి నిల్చుండటాన్ని గమనించిన తోటి ఉద్యోగులు, సంస్థ యాజమాన్యం కాళ్లబేరానికి వచ్చారు. అయినప్పటికీ ఆ యువతి వెనక్కి తగ్గలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందిని పోలీసులు రప్పించారు. 
 
అయితే పోలీసులు రంగంలోకి దిగి ఆమెకు నచ్చజెప్పారు. ఉద్యోగం నుంచి తొలగించబోమని.. యాజమాన్యం నుంచి కచ్చితమైన నిర్ధారణ వచ్చిన తర్వాతే ఆ యువతి డాబా పై నుంచి కిందకు దిగింది. ఈ ఘటన గుర్గామ్‌లో పెను సంచలనమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.