మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:08 IST)

టేస్టీ టేస్టీ పల్లీ నూడుల్స్.. ఎలా..?

కావలసిన పదార్థాలు:
నూడుల్స్ - 2 కప్పులు
చికెన్ - పావుకిలో
గుమ్మడికాయ ముక్కలు - అరకప్పు
ఉల్లిపాయ - 1
క్యారెట్ - 2
గుడ్లు - 2
వేయించిన పల్లీలు - అరకప్పు
సోయాసాస్ - 3 స్పూన్స్
వెనిగర్ - 1 స్పూన్
చిల్లీసాస్ - 1 స్పూన్
కొత్తిమీర - కొద్దిగా 
నూనె - 2 స్పూన్స్
కారం - తగినంత
ఉప్పు - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా నూడుల్స్‌ను వేడినీటిలో వేసి 2 నిమిషాల పాటు ఉడికించి ఆరబెట్టాలి. ఆ తరువాత చికెన్ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడయ్యాక క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.

ఆ తరువాత మరో బాణలిలో స్పూన్ నూనె వేసి ఉడికించుకున్న నూడుల్స్ వేసి వేయించి.. తరువాత సోయాసాస్, చిల్లీసాస్, వెనిగర్ వేసి నిమిషం పాటు వేయించుకోవాలి. ఆపై గుడ్లు పగలగొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి 5 నిమిషాల పాటు వేయించి చికెన్, క్యారెట్, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు, పల్లీలు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లి తీసుకుంటే.. పల్లీ నూడుల్స్ రెడీ.