శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By సందీప్
Last Updated : గురువారం, 30 మే 2019 (17:25 IST)

మటన్ పాయాతో మోకాళ్ల నొప్పులకు చెక్.. తయారీ విధానం..

సాధారణంగా మనం అప్పుడప్పుడు మన ఆహారంలో భాగంగా మటన్ పాయాను తీసుకుంటాము. దాని వల్ల అనేకమైన ప్రయోజనాలు మనకు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా మటన్ పాయాతో మహిళల్లో నడుము నొప్పిని నివారించవచ్చట. మోకాళ్ల నొప్పులకు కూడా ఇది బాగా పని చేస్తుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా కాల్షియం సమస్యలకు చెక్ పెడుతుంది. 
 
శరీరంలో కాల్షియం మరియు ఐరన్‌ల కోసం మటన్ పాయాను తీసుకోవడం మంచిది. మటన్ పాయాను తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. సాధారణంగా మేక కాళ్లతో మటన్ పాయాను తయారు చేస్తుంటారు. 
 
ముందుగా మేకకాళ్లను ప్రెజర్ కుక్కర్‌లో పెట్టి బాగా ఉడికించాలి. ఆ తర్వాత అన్ని రకాల గరం మసాలాలను అందులో వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదినా కూడా వేయాలి. తగినంత మోతాదులో ఉప్పు, కారం, పసుపు ఉపయోగించాలి. చివరగా నోరూరించే మటన్ పాయా తయారవుతుంది.
 
పిల్లలు లేదా పెద్దలు క్యాల్షియ లోపంతో బాధపడేవారికి.. మహిళలకు వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పిని నివారించేందుకు మటన్ పాయా ఎంతో మేలు చేస్తుంది. మటన్‌లోని విటమిన్స్, క్యాల్షియం, ఐరన్‌ కోసం మటన్ పాయా తీసుకోవడం ఉత్తమమని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
మటన్ పాయా ఎలా చేయాలి.. 
కావలసిన పదార్థాలు:
కాల్చిన మేకకాళ్లు :
కారం : నాలుగు చెంచాలు
ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు
పుదీనా ఆకులు: అర కప్పు
నూనె : తగినంత
కొత్తిమీర తరుగు : అరకప్పు
ఏలకుల పొడి : అర స్పూన్
లవంగాల పొడి : అరస్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర స్పూన్
ఉప్పు : తగినంత
పచ్చి కొబ్బరి తురుము: అరకప్పు
గసగసాల పేస్ట్ : అర స్పూన్
పసుపు: చెంచా,
నిమ్మకాయ: ఒకటి
 
తయారీ విధానం :
ముందుగా మేక కాళ్లకు పసుపు పట్టించి బాగా శుభ్రం చేసుకోవాలి. గసగసాలు, కొబ్బరి ముద్దలా చేయాలి. ప్రెషర్‌కుక్కర్‌లో మేక కాళ్లు వేసి సగం కారం, సగం అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, తగినన్ని నీళ్లు పోసి అంగంటసేపు సిమ్‌లో పెట్టి ఉడికించాలి. తర్వాత బాణలిలో నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.
 
దోరగా వేగాక ఉల్లి తరుగు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఆపై కొబ్బరి-గసగసాల ముద్ద వేసి ఓ నిమిషం వేయించాలి. తర్వాత కుక్కర్లో ఉడికించిన మేక కాళ్లని నీటితో సహా వేసి మసాలా మిశ్రమంలో కలపాలి. పది నిమిషాలు ఉడికించి దించేయాలి. ఉప్పు సరిచూసి దించేయాలి. కొత్తిమీర తరుగు గార్నిష్ కోసం వేసుకోవాలి. దీనిని వేడి వేడిగా బౌల్‌లోకి తీసుకుని సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.