సంబంధిత వార్తలు
- నాట్స్ ఆధ్వర్యంలో ఫ్లోరిడా, టెంపాబేలో వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
- బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన సాయిదత్త పీఠం
- నాట్స్ ఆధ్వర్యంలో బ్యాక్ టూ స్కూల్ కార్యక్రమం: తెలంగాణలో పేద పిల్లలకు అండగా నాట్స్
- డాలస్‌లో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిన నాట్స్
- ఇల్లినాయిస్ నాట్స్ ఉమెన్ త్రోబాల్ టోర్నమెంట్: ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు మహిళలు
నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేలా డిన్నర్ మీట్ అండ్ గ్రీట్
టెంపాబే నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేందుకు నాట్స్ టెంపా బే విభాగం మీట్ అండ్ గ్రీట్ పేరుతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టెంపాబేలో రోజు రోజుకి నాట్స్‌కు పెరుగుతున్న ఆదరణ అంతా... నాట్స్ తమదని భావించి ముందుకొస్తున్న వాలంటీర్లదేనని ఈ సందర్భంగా టెంపాబే నాయకత్వం వాలంటీర్లను ప్రశంసించింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వరంగల్ ఓయాసిస్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ జె.ఎస్. పరన్ జ్యోతి నాట్స్ సేవలను కొనియాడారు. నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలు మధ్య అనుబంధాలు, బాధ్యతలు ఎలా ఉండాలనే దానిపై కూడా చక్కటి దిశా నిర్దేశం చేశారు. టెంపాబేలో సాటి తెలుగువారి కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలందిస్తున్న నాట్స్ వాలంటీర్లను నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సత్కరించారు.
దాదాపు 100 మందికి పైగా తెలుగువారు కుటుంబ సమేతంగా ఈ మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని నాట్స్ కుటుంబ బలాన్ని చాటారు. నాట్స్ బోర్డు సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్/ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ కండ్రు, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే కో ఆర్డినేటర్ ప్రసాద్ అరికట్ల, నాట్స్ టెంపాబే జాయింట్ కో ఆర్డినేటర్ సురేశ్ బొజ్జ తదితరులు ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తర్వాతి కథనం
