గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (13:05 IST)

డిసెంబరు 12 మీ రాశి ఫలితాలు

మేషం : పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎల్‌ఐసి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట తప్పవు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు సవాలుగా నిలుస్తా

మేషం : పాత మిత్రుల కలయికతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఎల్‌ఐసి, పోస్టల్ ఏజెంట్లకు శ్రమ, త్రిప్పట తప్పవు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు సవాలుగా నిలుస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ప్రతికూలతలెదురవుతాయి.
 
వృషభం : ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. స్త్రీలు గృహోపకరణాలు, విలువైనవస్తువులు సమకూర్చుకుంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. మిత్రుల సహకారంలో కొత్త యత్నాలు మొదలెడతారు.
 
మిథునం : కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి. విద్యార్థులో భయాందోళనలు చోటు చేసుకుంటాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ దృక్పథం బలపడుతుంది.
 
కర్కాటకం : ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. నూతన వ్యాపారాలకు కావలసిన లైసెన్సులు మంజూరవుతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఆశ్చర్యకరమైన వార్తలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పాత రుణాలు తీరుస్తారు.
 
సింహం : కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొంత ఆలస్యంగానైనా అనుకున్న పనులు పూర్తి కాగలవు. ప్రముఖ సంస్థలతో సంయుక్తంగా కొత్త సంస్ధల స్థాపనకు యత్నాలు సాగిస్తారు. ఆశ్చర్యకరమైన వార్తలు, సంఘటనలు చోటుచేసుకుంటాయి. రుణ యత్నం ఫలించి ధనం చేతికందుతుంది.
 
కన్య : హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. అతిథి మర్యాదలు సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలకు సంబంధించిన లేఖలు అందుతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.
 
తుల : గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. ఉమ్మడి వ్యాపారాలు, నూతన వెంచర్లు లాభసాటిగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు అంతగా ఉండవు. రావలసిన ధనం వాయిదా పడుట వల్ల ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. సమావేశానకి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
 
ధనస్సు : ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
 
మకరం : కోర్టు వ్యాజ్యాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించటంవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి. ఓర్పు, వ్యవహార దక్షతతో కొన్ని సమస్యలు అధికమిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి.
 
కుంభం : ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, త్రిప్పుట అధికం. అయిన వారి గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం విద్య, ఉద్యోగ, వివాహ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆస్తి పంపకాల విషయంలో సోదరీసోదరుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటుకాగలదు.
 
మీనం : ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించక పోవచ్చు. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. బంధుమిత్రులతో పట్టింపులు ఏర్పడే సూచనలున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.