ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (11:56 IST)

శనివారం ఉప్పు, నూనె, చీపురును కొనుగోలు చేస్తే? (video)

Salt_Oil
శనివారాల్లో ఇనుపతో తయారైన వస్తువులు కొనుగోలు చేయకూడదు. అలా కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శనివారం పూట నూనెను కొనడం మానుకోవాలి.
 
కానీ నూనెను శనివారం విరాళంగా ఇవ్వవచ్చు. ఇంకా ఆవాలు కూడా శనివారం కొనకూడదు. ఇక ఉప్పు అనేది ఆహారంలో ముఖ్యమైన భాగం. శనివారాల్లో మాత్రం ఈ ఉప్పును కొనుగోలు చేయకూడదు. అలా కొనుగోలు చేస్తే మాత్రం రుణం కొని తెచ్చుకున్నట్లేనని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే శనివారం ఉప్పు కొన్నట్లైతే.. అది వ్యాధికారకమవుతుంది.
 
కత్తెరను కూడా శనివారం కొనకూడదట. అలా కొంటే ఒత్తిడి వేధిస్తుందట. ఇంకా నలుపు బూట్లు, నలుపు దుస్తులు కొనడం ద్వారా ఇబ్బందులు తప్పవంటున్నారు.. జ్యోతిష్య నిపుణులు. శనివారం నాడు ఇంధనాన్ని కొనుగోలు చేయడం నిషిద్ధం. శనివారం ఇంటికి తీసుకువచ్చిన ఇంధనం కుటుంబానికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది.
 
 


 
ఇంకా శనివారం చీపురు కొనకూడదు. ఇంకా శనివారాల్లో పిండికొట్టుకుని ఇంటికి తెచ్చుకోకూడదు. తద్వారా ఆహార సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. పిండికొట్టుకోవడానికి ఆదివారాలను ఎంచుకోవడం మంచిది. అలాగే బ్లూ ఇంకును శనివారం కొనకూడదు. గురువారం ఇంక్ కొనుగోలు చేసుకోవచ్చునని.. తద్వారా విద్యారంగంలో రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.