శనివారం, 2 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 అక్టోబరు 2022 (11:54 IST)

అక్టోబర్ 18 తర్వాత ఈ మూడు రాశుల వారికి లాభం..

Astrology
Astrology
అక్టోబర్ 18 తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి అంతగా కలిసిరావట్లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, తులా రాశుల అధిపతి శుక్రుడు. అటువంటి శుక్రుడు తన స్వంత రాశిలో మారడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఇలా శుక్రుడు తన స్థానం మారడం వల్ల ఈ రాశులకు మంచి జరిగే అవకాశం ఉంది.
 
మేషరాశి వారి రెండో ఇంటికి శుక్రుడు అధిపతి. అంటే ధనం, కుటుంబం, మాటలు, కళ్ళు వంటి వాటికి ఈ కాలంలో ఈ రాశుల వారి కెరీర్ వేగంగా పెరుగుతుంది. అనేక ఆదాయ అవకాశాలను పొందే అవకాశం ఉంది. 
 
వ్యాపారస్తులు కూడా అధిక లాభాలను పొందుతారు. రాజకీయ రంగాల్లో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. శుక్రుడి సంచారం వలన కన్యారాశి వారికి సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వీరు శుక్రుని సంచార సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం ఉంది.  
 
ధనుస్సు రాశి వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో మీరు ఉంటారు. తలపెట్టిన కార్యాల్లో విజయాలను సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా మంది ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్తులో సన్నిహిత వ్యక్తులు మీకు మద్దతు ఇస్తారు.  
 
ఇక మకర రాశి వారి జీవితంలో పెద్ద మార్పుల వల్ల మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.