బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 జులై 2022 (21:20 IST)

03-07-2022 నుంచి 09-07-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావాహ దృక్పథంతో మెలగండి. ఆరోగ్యం జాగ్రత్త పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం విషయంలో మేలు జరుగుతుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. 
 
వృషభం : కృత్తిక 2 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1,2 పాదములు 
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. అప్పులకు సాయం అందిస్తారు. ఆదివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్ధాంతంగా మెగిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. విమర్శలు పట్టించుకోవద్దు, సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. గృహమార్పు సత్ఫలితమిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదములు, అర్ధ, పునర్వసు 1, 2, 3 పాదములు 
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం, చేతిలో ధనం నిలవదు, పనులు హడావుడిగా సాగుతాయి. బుధ, గురు వారాల్లో వారాల్లో అప్రియమైన వార్తలు వింటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కార్మికులు, బిల్డర్లకు ఆదాయాభివృద్ధి, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు 
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. దంపతుల మధ్య అకారణ కలహం. సౌమ్యంగా మెలగండి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి, 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
అనురాగవాత్సర్యాలు వెల్లివిరుస్తాయి. బంధుమిత్రులతో అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. గురు, శుక్ర వారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. కార్మికులకు పనులు లభిస్తాయి. వాహనచోదకులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
వ్యవహారాలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. గృహమార్పు అనివార్యం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య వద్దుమణుగుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. ఒక ఆహ్వానం సందిగ్గానికి గురిచేస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. నిర్మాణాలు ఉపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయాభివృద్ధి కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2 3 పాదములు 
ఆదాయం సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. శనివారం నాడు పనులు అనుకున్న విధంగా సాగవు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పట్టుదలతో వ్యవహరించండి. వ్యతిరేకులతో జాగ్రత్త మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. కార్మికులకు పనులు లభిస్తాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
మీ ప్రతిపాదనలకు ఏమంత స్పందన ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ మాటతీరును కొంతమంది వక్రీకరిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. గృహవాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. దైవకార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 123 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఈ వారం అనుకూలదాయకం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. ఆది, సోమ వారాల్లో ఖర్చులు అధికం, ధనసమస్యలెదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. లైసెన్సులు, పర్మిట రెన్యువల్ లో అలక్ష్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భవన నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. శనివారం నాడు దుబారా ఖర్చులు అధికం. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాధ వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 23, 4 పాదములు 
ప్రతి విషయంలోను మీదే పైచేయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సోమ, మంగళ వారాల్లో పనులు, వాద్యతలు అప్పగించవద్దు. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఆత్మీయుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికారులకు హోదామార్పు, స్థానచలనం. విదేశీయానాలకు యత్నాలు సాగిస్తారు.