సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (12:35 IST)

కొబ్బరికాయతో విజయం.. మంగళవారం ఎర్రటి బట్టలో..?

coconut
కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా అంటారు. ఈ శ్రీఫలంతో అనుకున్నది సాధించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జీవితంలో ఏమైనా సమస్యలు తొలగి పోవాలంటే కొబ్బరి కాయ బాగా పని చేస్తుందని పండితులు చెప్తున్నారు. మంగళవారం పూట కొబ్బరి కాయను ఓ ఎర్రటి బట్టలో చుట్టి హనుమంతుడి పాదాల దగ్గర పెట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు పూర్తిగా తొలగి పోతాయి.
 
శుక్రవారం నాడు స్నానం చేసిన తర్వాత ఎర్రటి దుస్తులు ధరించి లక్ష్మీ దేవికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి కాయని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి కొదువ వుండదు. అలాగే శనిదోషాన్ని తొలగించుకోవాలంటే... శనివారం నాడు శని దేవుడి దగ్గరికి వెళ్లి కొబ్బరికాయలుని అక్కడ ఉండే నదిలో వేస్తే మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.