గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:02 IST)

09-10-2018 మంగళవారం దినఫలాలు - అకాల భోజనం, మితిమీరిన శ్రమతో...

మేషం: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. పాత సమస్యలు పరిష్కారంతో మానసికంగా కుదటపడుతారు. మీపై మీకే నమ్మకం తగ్గుతుంది. రవాణా, ఆటోమోబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి కానవస్తుంది. మీ సంతానం మెుండి వైఖరి మీకు ఒత్తిడి, చికాకులు కలిగిస్తుంది.
 
వృషభం: ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్విసించడం అంత మంచిది కాదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. అపార్ధాలు మాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.     
 
మిధునం: అకాల భోజనం, మితిమీరిన శ్రమ వలన ఆరోగ్యం మందగిస్తుది. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకుంటారు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇతురులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.  
 
కర్కాటకం: ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తులు అవసరం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పాత రుణాలు తీరుస్తారు.  
 
సింహం: విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. స్థిరచరాస్తుల విషయం గురించి చర్చిస్తారు. బంగారు, వస్త్ర, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తోటలు కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరి సహకారం లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు.   
 
కన్య: కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. విద్యార్థుల మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాభివృద్ధికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. అధైర్యం వదిలి ధైర్యంతో ముందుకు సాగి జయం పొందండి.  
 
తుల: కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే సూచనలున్నాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి.  
 
వృశ్చికం: ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. స్త్రీలు తెలివి తక్కువగా వ్యవహరించడం వలన చేపట్టిన పనికొంత ముందు వెనుకలుగానైనా జయం చేకూరగలదు. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.  
 
ధనస్సు: ఉద్యోగరీత్యా దూరప్రయాణాలు ఆందోళన కలిగిస్తాయి. రావలసిన ధనం చేతికందటంతో మీలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ప్రైవేటు సంస్థలలో వారు వారి అశ్రద్ధ, ఆలస్యాల వలన ప్రభుత్వ అధికారుల నుండి చికాకులు ఎదుర్కుంటారు. ఫ్యాన్సీ, వస్త్ర, కిరాణా, కిళ్లి రంగాలలో వారికి కలిసిరాగలదు. 
 
మకరం: దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. కంపెనీల ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. సంగీత కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి.  
 
కుంభం: జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులొస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి పథాకాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.    
 
మీనం: స్త్రీలు వస్త్రములు, ఆభరణములు వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.