మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

21-07-2020 మంగళవారం రాశిఫలాలు - జీవిత భాగస్వామి మనస్తత్వం...

మేషం : ఇతరుల సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ, సహకరించేవారుడరు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 
 
వృషభం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. వైద్యులకు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో మెళకువ వహించండి. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తిచేస్తారు. 
 
మిథునం : ప్రకృతి, సౌందర్యాలను చూసి సంతృప్తి చెందుతారు. ఆలయాలను సందర్శిస్తారు. క్రయ, విక్రయదార్లకు చికాకులు ఏర్పడతాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు, ఒత్తిడి తప్పదు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. సోదరి, సోదరులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. 
 
కర్కాటకం : కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనవసరపు విషయాలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. బిల్డింగ్ కాంట్రాక్టర్లకు తాపి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. 
 
సింహం : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ వహించండి. మిమ్మల్ని కొంతమంది సహాయం అర్థిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మంచి మంచి అవకాశాలు సంతృప్తినిస్తాయి. మీ అశ్రద్ధ ఆలస్యాల వల్ల కొన్ని చికాకులు ఎదుర్కొనక తప్పదు. రాజకీయాలలో వారు వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. 
 
కన్య : దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం  బాగుగా ఖర్చు చేస్తారు. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కారమార్గం కానవస్తుంది. దూర ప్రయాణాలలో ఒకరి వైఖరి ఆందోళన కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
తుల : విదేశాలు వెళ్లేటపుడు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. కాంట్రాక్టర్లకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటినా మిత్రుల సహాయ సహకారాలతో సమసిపోగలవు. 
 
వృశ్చికం : విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల వల్ల ఉల్లాసంగా గడుపుతారు. సిమెంట్, ఇసుక, ఇటుక, తాపి పనివారికి చికాకులు అధికమవుతాయి. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కోర్టు విషయాల్లో ప్రతికూలత తప్పకపోవచ్చు. 
 
ధనస్సు : ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయు యత్నాలలో జయంపొందుతారు. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. సినిమా రంగాల్లో వారికి సంతృప్తికానవస్తుంది. స్త్రీలకు మూలక సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. 
 
మకరం : ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. మీ కోరికలు, అవసరాలు వాయిదావేసుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారికి మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు చికాకులు తప్పనిసరిగా ఉంటాయి. కోర్టు పనులు, లిటిగేషన్లు పరిష్కారమవుతాయి. దూక ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. ఉద్యోగస్తులకు ఊహించని అవరోధాలు తలెత్తుతాయి. బృంద కార్యక్రమాల్లో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు విద్యా విషయాల్లో చికాకులు తప్పకపోవచ్చు. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. 
 
మీనం : టెక్నికల్, వైజ్ఞానిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు సామాన్యంగా ఉండగలవు. ఇరులను విమర్శించడం వల్ల మాటపడక తప్పదు. ఉపాధ్యాయ రంగాలలో వారికి చికాకులు అధికం. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.