మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

23-07-2020 గురువారం రాశిఫలాలు - స్త్రీలకు ఇరుగు పొరుగువారితో సఖ్యత....

మేషం : శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. కోర్టుకు హాజరవుతారు. నిరుద్యోగులు సదావకాశాలను జారవిడుచుకుంటారు. 
 
వృషభం : రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చిన్నారుల విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆహార విషయాలపై దృష్టిసారించడం అవసరం. పెన్షన్, బీమా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ధోరణి నెలకొంటుంది. 
 
మిథునం : కుటుంబంలోనూ, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు, టీవీ, ఛానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. 
 
కర్కాటకం : స్థిరాస్తి క్రయ, విక్రయం విషయంలో మంచిలాభం ఉంటుంది. ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వృత్తి వ్యాపారాలలో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.
 
సింహం : ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మెరుగుపడతాయి. మీ పనులు మందకొడిగా సాగుతాయి. క్రయ విక్రయాలు వాయిదాపడుట మంచిది. రాజకీయనాయకులు సన్నిహితులతో కలిసి సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండిధైర్యంతో శ్రమించి పూర్తిచేస్తారు. 
 
కన్య : పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. చేయని యత్నాలకు ప్రతిఫలం ఆశించకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. 
 
తుల : ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనుపరుస్తారు. పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. గతకాలం జ్ఞపకాలు గుర్తుకువస్తాయి. 
 
వృశ్చికం : స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. వృత్తులవారికి సంతృప్తి, పురోభివృద్ధి. ధనాన్ని మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు : మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయడం మంచిది. రావలసిన మొండిబాకీలు వాయిదాపడతాయి. నూతన దంపతులకు ఎడబాటు తప్పదు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట తప్పదు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
మకరం : ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కార్యసాధనలో ఆత్మవిశ్వాసం, మొండి ధైర్యంతో ముందుకు సాగండి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
కుంభం : ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. విద్యా సంస్థలలో వారికి ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. 
 
మీనం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆధ్యాత్మిక విషయాలు, దాన ధర్మాలకు ఖర్చులు చేస్తారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత ముఖ్యం. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు.